Apollo Hospital: అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్‌కు “ఫెలో అఫ్ ది అమెరికన్ అకాడమీ అఫ్ న్యూరోలజి” (FAAN)
వైజాగ్ లోని ప్రముఖ న్యూరాలజిస్టులలో ఒకరు మరియు స్ట్రోక్ మేనేజ్మెంట్లో నిపుణుడైన డాక్టర్ రాజేష్ వెంకట్ ఇందాల, MBBS, DNB (జనరల్ మెడిసిన్), DM (న్యూరాలజీ), సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ వైజాగ్, వారిని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (AAN) యొక్క ప్రతిష్టాత్మక ఫెలోషిప్తో సత్కరించబడ్డారని ప్రకటించడానికి గర్వంగా ఉంది. ఈ విశిష్ట గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా న్యూరాలజీ రంగంలో అసాధారణ కృషి చేసిన అతి కొద్దిమంది న్యూరాలజిస్టులకు మాత్రమే అందజేస్తారు. డాక్టర్ రాజేష్ వెంకట్ గారు ఈ ప్రాంతంలోనే ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌ను పొందిన అతి పిన్న వయస్కుడైన న్యూరాలజిస్ట్ కావడం గమనార్హం.
“అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ గుర్తింపు పొందడం నిజంగా గౌరవం” అని డాక్టర్ ఇందాల అన్నారు. “ఈ ఫెలోషిప్ ఎన్నో సంవత్సరాల అభ్యాసం, సహకారం మరియు రోగి సంరక్షణకు ప్రతిబింబం. ఇది న్యూరోలజి విభాగం పట్ల నాకున్న అంకితభావము తెలియపరుస్తూ మరియు ఆ విభాగ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందజేయుటలో నేను ఎల్లప్పుడూ ముందు ఉంటానని – డా రాజేష్ వెంకట్ పునరుద్గాటించారు”.
అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సభ్యులు ఈ స్పెషాలిటీలో అత్యున్నత ప్రమాణాల సాధనకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ అవార్డు వ్యక్తిగత విజయాన్ని గుర్తించడమే కాకుండా, అపోలో సాధించిన ఉన్నత ప్రమాణాలను కూడా ప్రదర్శిస్తుంది.







