Anita: భాగస్వామ్య సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : హోంమంత్రి అనిత
విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సుమారు 3,500 మంది పోలీసుల (Police) తో పటిష్ఠ భద్రత చేపట్టినట్లు తెలిపారు. సదస్సుకు వచ్చేవారు తిరిగి గమ్యస్థానానికి చేరేవరకూ రక్షణ బాధ్యత తమదేనన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదని వివరించారు. ఢిల్లీ (Delhi) పేలుళ్ల దృష్ట్యా రాష్ట్రమంతటా పూర్తి అప్రమత్తత కొనసాగుతోంది. భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ (Jagan batch) చేసే విషప్రచారాన్ని ఉపేక్షించం. ఒకప్పుడు వలసలు వెళ్లే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉండేది. ఇప్పుడు అంతా ఇక్కడికే వలస వచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది అని అన్నారు.







