Peddireddy: వైసీపీ నేత పెద్దిరెడ్డి భూముల ఆక్రమణలపై వీడియో విడుదల
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల ఆక్రమణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు (Chittoor) జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు (Videos) తీశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు.







