సీఎం సహాయ నిధికి.. ఏపీ ఎండీసీ భారీ విరాళం

కొవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందించిన ఆంధప్రదేశ్ మినరల్ డవలప్‍మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ), డిఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు విరాళం. విరాళాలకు సంబంధించిన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సీఎస్ అదిత్యనాథ్ దాస్, గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్విదేది, ఏపీఎండీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.జి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.