నెల్లూరు జిల్లాకు మిధాని
నెల్లూరు జిల్లాకు మరో భారీ పరిశ్రమ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక మిధాని ( మిశ్ర ధాతు నిగమ్) జిల్లాలో ఏర్పాటు కానుంది. రూ.3 వేల కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా బీవీపాలెంలో ఇందుకోసం 110 ఎకరాలను కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రక్షణ, వైమానిక రంగాలలో, రాకెట్లలో ఉపయోగించే అల్యూమినియం అల్లాయ్ పరికరాలను ఈ ప్లాంట్లో తయారు చేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అనంతారంలో గ్యాస్టోప్ సంస్థ 300-400 కోట్ల పెట్టుబడితో విండ్ పవర్ టవర్ల ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థకు ఏపీఐఐసీ 65 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది.






