తానా సదస్సుకు దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ వచ్చే నెలలో అమెరికా వెళుతున్నారు. మే 26 నుంచి 28 వరకు ఆయన అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో పర్యటిస్తారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 21వ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.






