Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈనెల 19న
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్ (Good news). ఈనెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రోజు పీఎం కిసాన్ (PM Kisan) నిధులు విడుదల చేయనుంది. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల (Farmers) ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.






