టీటీడీ ఈవోగా శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని ఆ పోస్టు నుంచి రిలీవ్ కావాలని పేర్కొన్నారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.