AI Center: తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియా (Australia) కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ డీకిన్ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ( ఎల్‌వోఐ)పై డా.బీర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) సమక్షంలో డీకిన్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) సంతకాలు చేశారు. అనంతరం ఈ ఒప్పందం పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీలు సంయుక్తంగా నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తాయి. మన ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గనిర్దేశం చేస్తారు అని తెలిపారు.