US Open:యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అల్కరాజ్

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ (US Open) గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ (Alkaraj) గర్జించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4తో టాప్‌సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్ (Alkaraj) పై అద్భుత విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్ హార్డ్ కోర్టులో సిన్నర్ 28 వరుస విజయాల పరంపరకు అల్కరాజ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించిన అల్కరాజ్ తన కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ (Title) ను ఖాతాలో వేసుకున్నాడు. 22 ఏండ్ల అల్కరాజ్‌కు ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.