BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎట్టకేలకు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు (Ranchandra Rao) 22 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో యువతకు పెద్దపీట వేశారు. కొత్త కమిటీలో ఓసీలు 11 మంది, బీసీలు ఏడుగురు, ఎస్సీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. (అధ్యక్షుడితో కలిపితే మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య 23 కాగా, ఓసీల సంఖ్య 12 అవుతుంది). ఇక కమిటీ కూర్పులో బీసీలకు, మహిళలకు మూడో వంతు పదవులు దక్కాయి. గత కమిటీలో ఉన్నవారిలో ఐదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం లభించింది. 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, సంయుక్త కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధితో కలిపి కొత్త కమిటీని ప్రకటించారు. గత కమిటీలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సీనియర్ నేత, దివంగత ప్రధాని పీవీ మనవడు ఎన్.వి.సుభా్‌షను ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి (Vijayalakshmi) , మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తనయుడు బద్దం మహిపాల్‌రెడ్డిలకు తొలిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ (Virender Goud) ను అనూహ్యంగా ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. కాగా, ఐదు మోర్చాలకు కొత్తవారిని నియమించారు.