Zelensky: ఆ దేశాలపై సుంకాలు సబబే : జెలెన్‌స్కీ

రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై అమెరికా సుంకాలు పెంచడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొద్మిర్ జెలెన్‌స్కీ(Zelensky) సమర్ధించారు. అది సరైన ఆలోచన అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎక్కడా భారత దేశం పేరును ప్రస్తావించలేదు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ రష్యా (Russia)తో ఇంకా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న దేశాలపై టారీఫ్‌లు (Tariffs) పెంచడం మంచిదే. ఇది సరైన ఆలోచనే అని అభిప్రాయపడ్డారు. భారత్(India) పై టారీఫ్‌లు పెంచడం దుష్ఫలితాలు ఇచ్చిందా అన్న ప్రశ్నకు సమాధానంగా పై అభిప్రాయం వ్యక్తం చేశారు.