ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. ఆశ్చర్యపోయిన అమెరికా
కియ’పై అమెరికా ఆరా!
సిఎం కార్యాలయానికి వచ్చిన కాన్సులేట్ సిబ్బంది
రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ ‘కియ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చడీచప్పుడూ లేకుండా గురువారం ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా ఆశ్చర్యపోయింది. తమకు కూడా తెలియకుండా ఒప్పందం ఎలా సాధ్యమైందా అని ఆరా తీస్తోంది. శుక్రవారం అమెరికా కాన్సులేట్ సిబ్బంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన కియ.. అనంతపురం జిల్లాలో రెండు బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ.13 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు నిజంగా ముందుకొచ్చిందా అధికారుల వద్ద ఆరా తీశారు. అంత గోప్యంగా, గుంభనంగా ఎలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అమెరికా కాన్సులేట్ వర్గాలు దీనిపై ఆరా తీయడం సిఎంఒ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.













