తన కూతురిని పెళ్లి చేసుకోమని ఎన్టీఆరే అడిగారు
రాజకీయాల్లో తన ఎదుగుదలను చూసిన ఎన్టీఆర్ స్వయంగా వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అడిగారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతను కూడా చూసుకుంటునన్నారు. రాజకీయాలతో కుటుంబం ఆధారపడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని, దాని కోసమే 25 సంవత్సరాల క్రితం డెయిరీ పెట్టి, రాజకీయాలతో పాటు వ్యాపారాన్ని కూడా చూసుకునేవాడినని తెలిపారు. వ్యాపారం ప్రారంభించిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత, పార్టీ పనులు చూసుకుంటూ వ్యాపారానికి కూడా ఒక గంట సమయం కేటాయించేవాడిని వెల్లడించారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత వ్యాపార బాధ్యతను తన భార్యకు అప్పగించానన్నారు. 24 సంవత్సరాలుగా వ్యాపారాన్ని తన భార్యే చేసుకుంటున్నారని, ఇంట్లో ఎవరికి అభద్రతా భావం లేదని అన్నారు.






