CBN: సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ
సింగపూర్ రెండో రోజు పర్యటనలో ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సమావేశంలో చర్చించారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ఆసక్తి కనబరిచారు.







