అమరావతికి అందమైన రహదారులు
రాజధాని అమరావతిలోని అన్ని నగరాలు, టౌన్‌షిప్‌లను కలుపుతూ అందమైన రహదారుల నిర్మాణానికి నాంది పలికారు. సుమారు రూ.1020 కోట్ల అంచనా వ్యయంతో 7 ప్రాధాన్యరహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతి డెవలప్మెంట్ సంస్థ (ఏడీసీ) దీని బాధ్యతలు చూస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉగాది పర్వదినాన ప్రాధాన్యతరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నిర్మాణాలు చేస్తున్నారు. ఏపీ సీఆర్డీఏ 29గ్రా మాల్లోని రైతులు స్వచ్ఛందంగా సుమారు 33వేల ఎకరాలుభూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. రాజధాని అమరావతి పరిపాలన భవనాలకు చేరుకో వాలంటే విజయవాడ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వారికి సౌకర్యవంతంగా ఉండేందుకుఈ రోడ్లు నిర్మిస్తున్నారు. అన్ని రోడ్లు తూర్పు, ఉత్తరం ముఖంతో వెళ్లేలా నమూనా రూపొందించారు. రాజధానిలో తొలి దశగా 7 ప్రాధాన్య రోడ్లు 67 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు.వీటిని ఎక్స్‌ప్రెస్ హైవేగా పిలుస్తారు. ప్రతి రోడ్డు పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు.
వీధి దీపాలు, సైకిల్ ట్రాక్ వంటి సదుపాయాలు ఉంటాయి. 7 రోడ్లలో 3 పడమర నుంచితూర్పు వైపునకు, 4 దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రయాణించేందుకు వీలుగా నిర్మిస్తారు. మంగళగిరి నిడమర్రు బేతపూడి, శాఖమూరు, నెక్కల్లు నుంచి ఉత్తర ముఖంగా కృష్ణానదివరకు 4 రోడ్లు నిర్మాణం చేస్తారు. అనంతవరం, పిచ్చుకలవారిపాలెం, బోరుపాలెం, నెక్కల్లు నుంచి తూర్పుదిశగా విజయవాడ వైపు మూడు రోడ్లు వస్తాయి. ప్రతిరోడ్డు 60 మీటర్లు, 50, 40 మీటర్లుగా వెడల్పు ఉంటుంది. రోడ్డు పొడవు 8 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల పొడవున నిర్మించేలా రూపొందించారు. రోడ్ల పొడవు ఇలా ఉంటుంది. 14.85 కిలోమీటర్లు, 12.5, 9.97, 8.25, 7.8, 7.26 7.17 కిలోమీటర్లుగా నిర్మాణం చేస్తారు.
రాజధాని పరిధిలో ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఉంది. జాతీయ రహదారి వద్ద మణిపాల్నుంచి దొండపాడు వరకు 21.3 కిలోమీటర్ల పొడవున ఎనిమిది వరుసల రోడ్డు నిర్మిస్తున్నారు.






