పార్టీలో అతిశీ రూట్ క్లియర్ చేసుకుంటోందా…?

ఢిల్లీ సీఎం అతిశీ మార్లెనా.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆమె ఢిల్లీ మూడో మహిళా సీఎం. పార్టీలో హేమాహేమీలున్నప్పటికీ… వారందరినీ పక్కనపెట్టి, ఆమెకు ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పజెప్పారు అధ్యక్షుడు కేజ్రీవాల్. ఇంతకూ ఆమెను కేజ్రీవాల్ అంతగా ఎందుకు నమ్మారు..?పార్టీకి, అధినేతకు ఆమె అంత విధేయురాలుగా మారారా..? కేజ్రీవాల్ కు ఓసీటు వదిలి, ఆపక్క సీట్లో కూర్చుని అతిశీ ఢిల్లీ సీఎంగాప్రమాణ స్వీకారం చేశారు. ఈ నిర్ణయం చాలామందికి అర్థం కాకపోవచ్చు.
ఆమె స్వామి భక్తి ప్రదర్శించింది అనుకోవచ్చు. కానీ.. అతిశీ నిర్ణయం వెనక దూరదృష్టి ఉన్నట్లు అర్థమవుతోంది. ముందుగా ఆమె చేసిన నిర్ణయం సాధారణంగానే అధిష్టానానికి ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఆమె… పార్టీకి అంత విధేయురాలన్న విషయం మరోసారి క్లారిటీ వచ్చింది కనుక. ఇంకో విషయం ఆమె నిర్ణయం.. ఆప్ శ్రేణులను ఆనందానికి గురి చేసింది. ఎందుకంటే.. కేజ్రీవాల్ పై ఆమెకున్న భక్తి. బాధ్యత.. ఈ నిర్ణయంతో వెల్లడైంది అయితే అతిశీ.. ఇక్కడే వన్ షాట్ ఎట్ టూ బర్డ్స్ అన్నట్లు వ్యవహరించారు.
ఓవైపు హైకమాండ్ కు మోదాన్ని కలిగిస్తూనే.. కేడర్ దగ్గర మార్కులు వేయించుకున్నారు. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఢిల్లీ సీఎంకు అభ్యర్థి కావాల్సి వస్తే.. కచ్చితంగా తనకే అవకాశం దక్కేలా పావులు కదిపారన్నమాట. కేజ్రీవాల్.. ఇప్పటికే అనారోగ్యసమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. లిక్కర్ కేసు ఉండనే ఉంది. ఈనేపథ్యంలో అతిశీ లాంటి నమ్మినబంటుకు ప్రాధాన్యమిస్తారు కాబట్టి. ఆ దిశగా అతిశీ నరుక్కొచ్చారని చెప్పవచ్చు. మరోవైపు…ఆతిశీకి రాజకీయ అనుభవం మరియు ప్రజలతో ఉన్న అనుబంధం కేజ్రీవాల్‌కు నమ్మకం కలిగించింది.
ఆమె విద్యా రంగంలో చేసిన కృషి మరియు ప్రజలతో ఉన్న అనుబంధం ఆమెను ఈ పదవికి అనర్హురాలిగా చేస్తుంది.మూడవది, ఈ నిర్ణయం పార్టీ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపవచ్చు. కేజ్రీవాల్ తన స్థానాన్ని వదిలి, ఆతిశీకి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ లోపల ఉన్న విభేదాలను సర్దుబాటు చేయవచ్చని భావిస్తున్నారు. మరోవైపు..ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. కేజ్రీవాల్ తన స్థానాన్ని వదిలి, ఆతిశీకి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఢిల్లీ ప్రజలకు కొత్త ఆశలు, ఆశయాలు కలిగించవచ్చు.