బే ఏరియాలో ఘనంగా ఇండియా ‘డే’
బే ఏరియాలోని ఫ్రీమాంట్‌లో ఆగస్టు 14వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఇండియా డే’ పెరెడ్‌ను నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పెరెడ్ సాగింది. ఇండియన్ కాన్సల్ జనరల్ వెంకటేషన్ అశోక్, ఫ్రీమాంట్ మేయర్ బిల్ హారిసన్, అసెంబ్లీమెన్ విలియం క్విర్క్, ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఫౌండర్ డా. రొమేష్ జాప్రాతోపాటు అంజలి లతి, టామ్ హ్యాండ్లీ, సుజనె లీ చైన్ బాలీవుడ్ నటులు గుల్షన్ గ్రోవర్, రైనా సేన్, ప్రశాంత్ గుప్త, రణ్‌దీప్ హూదా తదితరులు ఈ పెరెడ్‌లో పాల్గొన్నారు. బే ఏరియాలోని ఇండియన్ కమ్యూనిటీ ప్రముఖులతోపాటు ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













