Sanjeev Khanna:ఎటువంటి పదవులూ స్వీకరించను : జస్టిస్ సంజీవ్ ఖన్నా

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna) పదవీకాలం నేటితో ముగిసింది. సుప్రీంకోర్టు (Supreme Court)లో చివరి రోజు బెంచ్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ తదుపరి ఎటువంటి అధికారిక పదవులను చేపట్టనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పారు. మరోవైపు జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (Supreme Court Bar Association) వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice) జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11 బాధ్యతలు చేపట్టారు.