jagdeep dhankhar: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు : ఉపరాష్ట్రపతి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (jagdeep dhankhar) ప్రశంసలు కురిపించారు. గోవా (Goa) రాజ్‌భవన్‌లోని వామన్ వృక్షకళా ఉద్యానవనంలో ప్రాచీన భారతీయ వైద్యులు చరక, సుశ్రూతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదినికి శిక్ష తప్పదని, ఉగ్రమూకలను ఎక్కడ దాక్కున్నా ఏరివేస్తామనే సందేశాన్ని పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చారన్నారు. భారత్ ఇప్పుడు ఎంతో భిన్నమైందని, విశ్వాసం, ధైర్యంతో ఉందన్నారు. ఉగ్రవాదాన్ని (Terrorism) ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు. దేశం గరప్వడేలా చేసినందుకు సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రువుల స్థావరాలను కచ్చితంగా అంచనా వేసి లక్ష్యాలను ఛేదించిన భారతీయ సాయుధ దళాల శక్తిని ప్రపంచం గుర్తించిందని తెలిపారు.