AIADMK: తమిళనాడులో ఎన్డీఏను నడిపించేంది అన్నాడీఎంకే ..?

తమిళనాట వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈతరుణంలో అధికార ఇండియా కూటమి పక్కాగా ప్రచారం నిర్వహిస్తోంది. ముఖ్యంగా డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్(Stalin) .. పక్కా హిందీ వ్యతిరేక సెంటిమెంట్ రేపారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీకి తద్వారా ఎన్డీఏకు గట్టి షాకిచ్చారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కు వెళ్లలేని స్థితికి చేరింది బీజేపీ. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో తమిళ పౌరుషం అంటూ ప్రచారం మొదలెట్టేశారు.దీనికి కౌంటరిస్తూ బీజేపీ నేతలు యాత్ర చేస్తున్నా.. పెద్దగా జనాదరణ కనిపించడం లేదు. దీంతో బీజేపీ కూడా కౌంటర్ టాక్టిక్స్ పై ఫోకస్ పెట్టింది.
ఇటీవలే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసిన అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి(palani swamy).. రాష్ట్రంలో తాజా పరిణామాలపైనా చర్చించారు. ఇందులో భాగంగా యాంటీ హిందీ ఉద్యమం, ప్రజల్లో వ్యతిరేక భావజాలం పెరుగుతుండడంతో దాానికి కౌంటర్ ఎలా చేయాలన్నదానిపైనా చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో తమ పార్టీని, తమనేతలను పబ్లిగ్గా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన అన్నామలైను తొలగించాలని పీఎస్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏమీ చర్చ జరగలేదని పీఎస్ అన్నా.. లేటెస్టుగా తాను అధ్యక్ష రేసులో లేనని అన్నామలై చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇక ఇప్పటికిప్పుడు చీఫ్ ను మార్చినా .. వేరే వ్యక్తి పార్టీని మళ్లీ గ్రిప్ లోకి తీసుకోవాలి.. అందరినీ ఏకతాటిపైకి నడిపించాలి. దీనికి అన్నా మలై లాంటి నేతలు సహకరించాల్సి ఉంటుంది. దీనికి తోడు అన్నామలై రాకతో రాష్ట్రంలో పార్టీ కాస్త బలపడుతోంది. ఇాలాంటి తరుణంలో అన్నామలై స్థానంలో వేరే వ్యక్తి రావడం .. పార్టీ క్యాడర్ కు కాస్త ఇబ్బందికర పరిణామమని చెప్పవచ్చు.
దీంతో ఇప్పుడు తమిళనాడులో ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాద్యత అన్నాడీఎంకే(AIADMK) పైనా పడింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. అత్యంత పటిష్టంగా ఉన్న డీఎంకేను.. చీలికపేలికల్లా మారిన అన్నాడీఎంకె ఎంతవరకు నిలువరిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. కలిసి ఉన్నట్లు కనిపించినా.. అన్నా డీఎంకేలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి తోడు వీరికి శశికళ రూపంలో ఓ ప్రత్యర్థి సైతం ఉన్నారు. ఇలాంటి పరిణామాల్లో పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్న స్టాలిన్ టీమ్ నుె.. ఎన్డీఏ ఎలా ఎదుర్కొంటుందన్నది వేచి చూడాలి.