Warren Buffett:వారెన్ బఫెట్ మరోసారి భారీ విరాళం

ప్రపంచ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ (Warren Buffett) దాతృత్వంలో ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈసారి కొన్ని రూ.వేల కోట్లను స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) కు వారెన్ బఫెట్ భూరి విరాళం ఇచ్చారు. 6 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్ వే షేర్లను విరాళంగా అందించారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.50 వేల కోట్లు అని అంచనా. ఒక్క ఏడాదిలో ఇంత మొత్తం విరాళంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మొత్తాన్ని గేట్స్ ఫౌండేషన్‌తోపాటు, కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించారు.