Shamshabad Airport: ముగ్గురు గవర్నర్ల అనూహ్య భేటీ

ఇద్దరు గవర్నర్‌లు, మరో లెఫ్టినెంట్ గవర్నర్ (Governor) అనూహ్యంగా కలుసుకున్నారు. ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport )లో ఈ భేటీ జరిగింది. నగరంలో పలు శుభకార్యాలకు హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Dattatreya), తిరిగి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకున్నారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha), మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయశంకర్ (Vijayashankar) కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ముగ్గురూ విమానాశ్రయంలో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అనూహ్యంగా జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకమే అని దత్తాత్రేయ కార్యాలయవర్గాలు తెలిపాయి.