Supreme Court : సుప్రీంకోర్టుకు అమెరికా ప్రభుత్వ విజ్ఞప్తి.. ఆ పిటిషన్‌ను తిరస్కరించండి

తనను భారత్‌కు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముంబయి దాడుల కేసులో దోషి అయిన తహవ్వూర్ రాణా(Tahawwur Rana) దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని సుప్రీంకోర్టుకు అమెరికా (America) ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ మూలాలు కలిగిన కెనడా జాతీయుడైన అతడు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందేనని ఈ నెల 16వ తేదీన అమెరికా సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రిలోగర్ (Elizabeth B. Priloger) కోర్టులో అఫిడటివ్ వేశారు. భారత్‌కు అప్పగించడం నుంచి రాణా ఉపశమనం పొందలేడని 20 పేజీల అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు.
2008 ముంబయి దాడుల కేసులో దోషి అయిన రాణా (Rana) ను తీసుకు రావాలని అమెరికా కోర్టులో భారత్ (India) పోరాడుతోంది. దీంతో దిగువ కోర్టులతో పాటు అనేక ఫెడరల్ కోర్టుల్లో రాణా ఓడిపోయాడు. శాన్‌ఫ్రాన్సిస్కో లోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ అతడికి చుక్కెదురైంది. దీంతో నవంబర్ 13వ తేదీన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని జైలులో ఉన్నాడు.