కంటినిండా కునుకు.. రూ.5 లక్షలు గెలుచుకుంది!
కంటినిండా కునుకు తీసినందుకు కోల్‌కతా యువతి రూ. 5లక్షలు సొంతం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన త్రిపర్ణ చక్రవరి(26) తన డ్రీమ్ జాబ్‌లో భాగంగా ఆగస్ట్ 24న తన స్లీపింగ్ స్కిల్స్‌తో రూ.5 లక్షలను దక్కించుకుంది. త్రివర్ణ చక్రవరి వేక్‌ఫిట్.కో లో ఇంటర్న్‌షిప్ ప్రోగామ్కు అప్లై చేసింది. టైటిల్‌ను గెలుచుకునేందుకు ఆమె వరుసగా వంద రోజులు రోజుకు నిరాటకంగా 9 గంటల పాటు నిద్రించింది. ఫైనల్లో నలుగురిని పక్కకు నెట్టి ఆమె టైటిల్‌ను దక్కించుకుంది. నాన్ స్టాప్ స్లీపీంగ్లో తనకు టైటిల్ లభించడం పట్ల త్రివర్ణ సంతోషం వ్యక్తం చేసింది. ఈ అవార్డుకు సరైన వ్యక్తికి, సరైన సమయంలో, సరైన ప్రదేశంలో దక్కిందిగా తాను భావిస్తానని చెప్పుకొచ్చింది. జీవితంలో కష్టపడే ప్రతి ఒక్కరికీ సరైన నిద్ర చాలా అవసరమని దేశంలో ఫస్ట్ స్లీప్ ఛాంపియన్ కిరిటీ దక్కించుకున్న త్రిపుర్ణ తెలిపింది.






