అదానీదే ఆధిపత్యం.. ముకేష్ అంబానీ కన్నా
ఆస్తుల మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించారు. మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అదానీ గ్రూప్‌ల సంపద మొత్తం 19.44 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖేష్ అంబీనీ సంపద 17.89 లక్షల కోట్లుగా ఉంది. టాటా గ్రూప్ మార్కెట్ సంపద 21.73 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ ప్రకారం అగ్రస్థానంలో టాటా గ్రూప్ కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని అధిగమించిన అదానీ రెండో స్థానంలోకి వచ్చారు. ముఖేష్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. అదానికి చెందిన అనేక సంస్థల సంపద వేగంగా పెరుగుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదానీ గ్రూప్ 10 లక్షల కోట్ల సంపదను పెంచుకుంది. అదే సమయంలో ముకేష్ అంబానీ కంపెనీల సంపద కేవలం 1.61 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. టాటా గ్రూప్‌ల మొత్తం సంపద ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ సంపద 2021 డిసెంబర్ నాటికి ఇప్పటి వరకు 9.62 లక్షల కోట్ల నుంచి 19.44 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంత వేగంగా దేశంలో ఏ కంపెనీ సంపద పెరగలేదు.






