Blackbox : బ్లాక్‌బాక్స్ లభ్యం .. కీలక సమాచారంపై ఉత్కంఠ!

అహ్మదాబాద్ నుంచి లండన్ (London) కు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ (Blackbox) లభ్యమైంది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెల్లడిరచింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది (Staff) పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానం (Airplane) లో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్‌లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది.