Terrorists : జమ్మూకశ్మీర్ ప్రజలకు ఇప్పుడు మరో సమస్య

పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులు గందర గోళానికి గురవుతున్నారు. భద్రతా బలగాలు (Security forces), ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయపడుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి కూడా ముప్పును పసిగట్టడంతో ఇబ్బంది ఎదురవుతోం ది. పహల్గాం దాడి (Pahalgam attack) నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది . ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకుల (Tourists) పై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ రోజు కాల్పులు జరిపిన దుండులు సైనిక దుస్తుల్లో వచ్చారని, వారు ఉగ్రవాదులను తెలుసుకోలేకపోయామని నాడు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. అయితే ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.