కమలా హ్యారిస్ గెలుపుకోసం.. తమిళనాడులో

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె పూర్వీకుల స్వస్థలమైన తమిళనాడులోని తిరువారూరు జిల్లా తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరిలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. కమలా హ్యారిస్ ఫోటోలు ముద్రించిన పోస్టర్లను ఊరంతా అతికించి సందడి చేశారు. కమల తల్లి వైపు తాతముత్తాతలంతా తులసేంద్రపురానికి చెందినవారు. ఈ కారణంగానే అక్కడి ధర్మశాస్త్ర ఆలయంలో గత రెండు రోజులుగా కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటూ గ్రామస్థులు ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిపారు. మదురైరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కమల గెలుపును కాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.