తెలంగాణ మీదుగా సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే.. దేశంలో రెండవ అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే

భారతదేశంలో డిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తరువాత సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే రెండవ అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా నిలువనున్నది.
6 వరసలతో 1,271 కిమీ దూరంతో నిర్మిస్తున్న సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మార్గం గుజరాత్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన సూరత్‌ను, తమిళనాడు రాజధాని నగరమైన చెన్నైతో కలుపుతుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లా ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఈ మార్గం కర్ణాటకలోని రాయచూరు జిల్లా నుంచి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా కర్నూలు వైపు వెలుతుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే గుజరాత్ లోని సూరత్, మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్‌నగర్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్, కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, కడప, తిరుపతి నగరాలను కలుపుతుంది. ఆలాగే జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఆరు రాష్ట్రాల్లోని 16 జిల్లాల మీదుగా ఈ మార్గం వెలుతుంది.
ఈ మార్గం వల్లా సూరత్ నుంచి చెన్నై వరకు ప్రస్తుతం ఉన్న 1,570 కిమీల దూరం 1,271 కిమీల తగ్గుతుండగా ప్రయాణ సమయం 35 గంటల నుంచి 18 గంటలకు తగ్గనున్నది.
శ్రీ నరేంద్ర మోది గారి నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన పెద్ద నిర్మాణ కార్యక్రమాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ వే ఒకటిగా నిలువనున్నది. దీని అంచనా వ్యయం రూ. 45,000 కోట్లు. ఈ పెట్టుబడి దేశంలోని రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచడంతో పాటు ఆరు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. NHAI ఈ మార్గం పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్నది.
– జి.సురేందర్, భూవిజన్ న్యూస్