Supriya sule: అలా మాట్లాడలేను.. కానీ : సుప్రియా సూలే

ఈవీఎంల వ్యవహారంపై ఎన్సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya sule) కీలక వ్యాఖ్యలు చేశారుఏ. ఆధారాల్లేకుండా ఈవీఎంల(EVMs)ను నిందించలేమన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ (Maharashtra Assembly) ఎన్నికల్లో బారామతి నుంచి పరాజయం పాలైన తమ పార్టీ అభ్యర్థి యోగేంద్ర పవార్ (Yogendra Pawar) రీకౌంటింగ్ కోరడం సరికాదని సుప్రియ అభిప్రాయపడ్డారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించగా, అతడు వెనక్కి తీసుకున్నాడని మీడియాకు వెల్లడిరచారు.
ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే తాను నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైనప్పుడు, అందులో స్కామ్ ఉందని ఎలా చెప్పగలనన్నారు. కాకపోతే, ఓటర్ల జాబితాపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, అందువల్ల ఈవీఎంలు అయినా, బ్యాలెట్ (Ballet ) అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని , అందుకు ఇబ్బందేంటని సుప్రియా ప్రశ్నించారు.