హేమంత్ సోరెన్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రaార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం తనకు బెయిల్ మంజూరు చేయాలని సోరెన్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ సోరెన్ పిటిషన్‌పై అసమనం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదన్న విషయాన్ని తమకు తెలపలేదని, కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని ఆగ్రహించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తామని హెచ్చరించింది. దీంతో సోరెన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.