Pawan Kalyan: ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

అచంచలమైన క్రమశిక్షణ, నిబద్దతతో దేశానికి ప్రధాని మోదీ (Modi) మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయన పవన్ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. ప్రధాని మోదీ పాలనకే పరిమితం కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించారు. ప్రతి పౌరుడు మన సంస్కృతి, వారసత్వం పట్ల గర్వపడేలా చేశారు. ఆత్మనిర్బర్ భారత్ (India) కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దృఢ సంక్పలం, సమగ్రత, ఆధ్యాత్మిక బలంతో దేశాన్ని మారుస్తున్న మోదీ జీవితం స్ఫూర్తిదాయకం. మంచి ఆరోగ్యం, దీర్ఘయుషుతో దేశాన్ని నిరంతరం నడిపేందుకు మరింత అచంచలమైన శక్తి ఆయనకు ఉండాలని ప్రార్థిస్తున్నా అని పవన్ పేర్కొన్నారు.