సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు

హైకోర్టుల జడ్జీలు ఎన్.కోటిశ్వర్ సింగ్, ఆర్.మహదేవన్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ట్‌గా ఉండగా, మహదేవన్ మద్రాస్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరికి సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియంలో సీజే చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టులో మంజూరైన జడ్జి పోస్టులు 34 కాగా ప్రస్తుతం 32 మంది ఉన్నారు.