Modi: బీడీలతో పోల్చి బిహారీలను కాంగ్రెస్ అవమానించింది: మోదీ

బిహార్ ప్రజలను బీడీలతో పోల్చి వారందర్నీ కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బదులిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హెచ్చరించారు. బిహార్‌లో రూ.40 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్ణియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మోదీ మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ గురించి కేరళ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశా. “బీడీ, బిహార్ అనే పదాలు రెండూ ‘బీ’ అక్షరంతో మొదలవుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది బిహార్ ప్రజలకు తీరని అవమానం” అని మోదీ (PM Narendra Modi) అన్నారు. గతంలో ఆర్‌జేడీ-కాంగ్రెస్ కూటమి అస్సాం, బెంగాల్, బిహార్లలో విదేశీ చొరబాటుదారులకు మద్దతిచ్చి జనాభాలో అవాంఛనీయ మార్పులకు కారణమైందని మోదీ విమర్శించారు. ఆ పార్టీలకు వారి కుటుంబాలే ముఖ్యమని, తాను మాత్రం ‘సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్’ సూత్రాన్నే నమ్ముతానని ప్రధాని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం పంపే రూపాయిలో 15 పైసలు మాత్రమే పేదలకు చేరేవని, మిగిలిన 85 పైసలను కాంగ్రెస్, ఆర్‌జేడీలు మింగేసేవని ఆయన (PM Narendra Modi) ఆరోపించారు.