Viji: అప్పుడు బాలయ్యకు తల్లిగా, ఇప్పుడు చరణ్ కు తల్లిగా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్(janhvi kapoor) జంటగా నటిస్తున్న సినిమా పెద్ది(peddi). ఉప్పెన(uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(buchibabu sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలుండగా, ఆ అంచనాలను మొన్నా మధ్య వచ్చిన ఫస్ట్ షాట్(peddi firstshot) అనే గ్లింప్స్ ఇంకాస్త పెంచింది.
టాలీవుడ్ లో వచ్చే ఏడాది రిలీజ్ కానున్న భారీ మూవీస్ లో పెద్ది కూడా ఒకటి కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా కోసం బుచ్చిబాబు ప్రతీదీ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్(siva rajkumar), జగపతి బాబు(jagapathi babu), దివ్యేందు శర్మ(divyendu sharma)లను తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు మరో స్టార్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
పెద్ది సినిమా కోసం బుచ్చిబాబు కన్నడ సీరియల్స్ తో మరియు సినిమాలతో ఎంతో పాపులర్ అయిన విజి చంద్రశేఖర్(Viji Chandrasekhar) ను తీసుకున్నరని తెలుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ కు తల్లి పాత్రలో నటించడానికి విజిని ఎంపిక చేశారని అంటున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ హిట్ సినిమా మామన్(maaman) లో నటించి మెప్పించిన విజి, తెలుగులో అఖండ(akhanda) సినిమాలో బాలయ్య(balayya)కు తల్లిగా కనిపించారు. అఖండ తర్వాత ఆమెకు తెలుగులో మంచి అవకాశాలొస్తుండగా ఇప్పుడు పెద్దితో మరో బంపరాఫర్ ను అందుకున్నారు.