స్పైస్లాక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన స్పైస్‌జెట్
నచ్చిన ధరకు విమానం టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వీలుకల్పించే స్పైస్లాక్ సదుపాయాన్ని స్పైస్‌జెట్ తిరిగి ప్రవేశపెట్టింది. వినియోగదారులు రూ.99 చెల్లించి స్పైస్లాక్ కింద స్పైస్‌జెట్ విమానాల్లో అందుబాటులో ఉన్న ధరకు టిక్కెట్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రయాణించేవారి వివరాలు తేలకున్నా, ప్రయాణికుల పేరు నమోదు చేయకుండానే ఇలా సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. 48 గంటల పాటు అదే ధరకు టికెట్ కొనే వీలుంటుంది. దేశీయ మార్గాల్లో బుక్ చేసుకున్న కనీసం 7 రోజుల తరవాత ప్రయాణించే వారికి, అంతర్జాతీయ మార్గాల్లో 15 రోజుల తరవాత ప్రయాణానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.






