ఢిల్లీ-తిరుపతి మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసు
ఢిల్లీ, తిరుపతి మధ్య స్పైస్‌జెట్ విమాన సర్వీసు ప్రారంభమైంది. స్పైస్‌జెట్‌ను కేంద్ర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీ లో ప్రారంభించారు. తొలి సర్వీసు ఆదివారం 9:50కు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ మీదుగా 12:10 నిమిషాలకు తిరుపతి చేరుకుంది. 120 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ సర్వీసు, రోజుకు రెండు సార్లు అందుబాటులో ఉంటుంది. స్పైస్‌జెట్ నూతన సర్వీసు ద్వారా దేశ రాజధానిని ఆధ్యాత్మిక రాజధానితో అనుసంధానం చేశామని సింధియా తెలిపారు. తిరుపతి అంతర్జాతీయ విమాన సర్వీసు జీఎం సురేష్ మాట్లాడుతూ గతంలో ఎయిరిండియా మాత్రమే ఢిల్లీ వయా హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు సర్వీసు నడుపుతుందన్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ కూడా శ్రీవారి భక్తులకు సేవలు అందించనుందని తెలిపారు. విమాన సర్వీసుల ద్వారా ఏటా 3.5 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.






