Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి అనారోగ్యం!

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, కీలక నేత సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (IGMC) ఆసుపత్రిలో ఆమెను మూడురోజుల క్రితమే చేర్చినప్పటికీ, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఆరోగ్య స్థితిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇలా సడెన్‌గా తమ అధినేత్రి ఆస్పత్రి పాలవడంతో కాంగ్రెస్ (Congress) వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. గతంలో కూడా కొన్నిసార్లు కడుపు నొప్పితో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ (Sonia Gandhi) చికిత్స పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందో కూడా తెలియకపోవడంతో కాంగ్రెస్ (Congress) నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు.