Shiv Nadar:హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ భారీ విరాళం

తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ (Subrahmanya Swamy Temple) జీర్ణోద్ధరణకు ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ (Shiv Nadar) రూ.206 కోట్లు విరాళం అందించారు. ఇక్కడి మురుగన్ ఆలయంలో 15 ఏళ్ల తర్వాత కుభాభిషేకం జరిగింది. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. మొత్తం రూ.300 కోట్లతో జీర్ణోద్ధరణ, ఇతర సదుపాయాల కల్పన చేపట్టడంతో గుడి కొత్తరూపు సంతరించుకుంది. అందులో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన వామా సుందరి పౌండేషన్ (Vama Sundari Foundation) ద్వారా రూ.206 కోట్ల విరాళం అందించారు. దక్షిణాది జిల్లాల్లో ఉన్న పలు ఆలయాల్లోనూ ఈ ఫౌండేషన్ జీర్ణోద్ధరణ పనులు చేపడుతోంది. శివ్ నాడార్ సొంతూరు తిరుచ్చెందూర్ (Tiruchendur) సమీపం మూలైపొలి గ్రామం.