రతన్ టాటా వీలునామాలో.. మరో ఆసక్తికర విషయం!

ముంబయిలో ఇటీవల కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు జంతు ప్రేమికుడిగానూ గొప్ప పేరుంది. వీధి శునకాల సంరక్షణకు ఆసుపత్రులను నిర్మించిన ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా వీలునామాలో తన పెంపుడు శునకం టిటో పేరును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. టిటో జీవిత కాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మెత్తాన్ని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ఆయన వద్ద ఎంతోకాలంగా పనిచేసిన వంటమనిషి రాజన్ షాకు అప్పగించినట్లు తెలిసింది. అలాగే గత మూడు దశాబ్దాలుగా తన వద్ద పనిచేస్తూ, తోడుగా ఉన్న వ్యక్తి గత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్యల పేర్లను కూడా వీలునామాలో చేర్చినట్లు తెలిసింది. రతన్ టాటా గతంలో ఓసారి తాజ్ హోటలు ప్రాంగణంలో వీధికుక్కలకు ఆశ్రయం కల్పించారు. చివరిసారిగా ఆయన పని చేసిన ప్రాజెక్టు కూడా శునకాల కోసమే కావడం గమనార్హం. ముంబయిలోని అయిదు అంతస్తుల భవనంలో 200 శునకాలు ఉండేందుకు అనువుగా పెట్ ప్రాజెక్ట్ పేరిట దీన్ని ప్రారంభించారు.