Mock Drills: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం …పాక్ సరిహద్దు ప్రాంతాల్లో

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మే 29న మాక్‌డ్రిల్ (Mock Drills) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుజరాత్ (Gujarat), పంజాబ్(Punjab), రాజస్థాన్ (Rajasthan) , జమ్మూ కశ్మీర్‌లోని ఆయా జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఈ క్రమంలో పౌర సన్నద్ధతపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేరోజు ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యం పాకిస్థాన్, పీవోకేలపై దాడులు చేసింది. అక్కడి ఉగ్రవాద, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.