ఎస్‍బీఐ ఖాతాదారులకు మరో గుడ్‍న్యూస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) తన ఖాతాదారులకు మరో గుడ్‍న్యూస్ అందించింది. కొద్ది రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్‍డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని ఎస్‍బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‍కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసీ అప్‍డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్‍ను వ్యక్తిగతంగా బ్రాంచ్‍ను సందర్శించాల్సిన అసవరం లేదు. కేవైసీ అప్‍డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం అని ఎస్‍బీఐ ప్రకటించింది.