ఎస్‍బీఐ కీలక నిర్ణయం… ఖాతాదారులకు

కరోనా సమయంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా ఎస్‍బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు విత్‍డ్రాకు సంబంధించిన పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రోజువారీ నగదు విత్‍డ్రా చేసే పరిమితిని పెంచింది. వేరొక శాఖలో ఖాతాదారులు విత్‍డ్రా ఫారం సహాయంతో తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.25 వేల వరకు నగదును ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది. అదే చౌక్ రూపంలో అయితే మరో బ్రాంచ్ నుంచి రూ.లక్ష వరకు తీసుకోవచ్చునని వెల్లడించింది. అలాగే థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని కూడా 50 వేల రూపాయల వరకు పెంచింది.
ఈ కొత్త రూల్స్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్న ఎస్‍బీఐ 2021 సెప్టెంబర్ 30 వరకు ఇవి వరిస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు విత్‍డ్రా చేయడం కుదరదని, థర్డ్ పార్టీ కెవైసీ డాక్యుమెంట్ అవసరమని బ్యాంకు కీలక ప్రకటన చేసింది. కాగా ఎస్‍బీఐ ప్రతీ నెల తన ఖాతాదారులకు 8 ఉచిత ఎటిఎం లావాదేవీలను అందిస్తోంది. అలాగే నాన్ మెట్రో నగరాల్లో 10 ఉచిత ఎటీఎం లావాదేవీలు ఉన్న విషయం విదితమే.