Sabarimala: శబరిమల ఆలయం మూసివేత.. మకర విళక్కు పండుగ రోజునే దర్శనం

శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగియడంతో ఆలయాన్ని మూసివేశారు. గురువారం మధ్యాహ్నం మండల పూజ చేసిన అర్చకులు ఆలయం తలుపులు మూసివేశారు. ఈ నెల 29వ తేదీ వరకు (Sabarimala) ఆలయం మూసి ఉంటుందని, ఆ తర్వాత మకర విళక్కు సీజన్ కోసం మళ్లీ డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తామని ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు తెలిపింది. ఏటా జరిగే మకర విళక్కు పండుగ రోజు అయ్యప్పను దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు (Sabarimala) శబరిమలకు తరలివస్తారు. ఆలయ వర్గాల ప్రకారం, ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది ఈ సంఖ్య 28,42,447 మందిగా ఉంది.