RTPCR : ప్రధానితో భేటీ కావాలంటే … ఆర్టీపీసీఆర్ తప్పనిసరి!

దేశంలో కొవిడ్ (Covid) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ బారన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. దేశంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ(Health Department) సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలిసే మంత్రులు (Ministers), ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.