ఎక్కువ మంది పిల్లలున్న వారికి…రూ.లక్ష బహుమతి

జనాబాను నియంత్రించడానికి అసోంతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలు చాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖ మంత్రి రాబర్ట్ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధిక మంది పిల్లలున్న కుటుంబానికి లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఐజ్వాల్ తూర్పు-2 నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మిజో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి పాదర్స్ డే రోజు ఈ ప్రకటన చేశారు.