Rohith Sharma: ఊహించిందే జరిగింది, రోహిత్ గుడ్ బై

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన తర్వాత.. రోహిత్ శర్మ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అయితే రోహిత్ శర్మ మాత్రం కొన్నాళ్లపాటు క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే మునుపటి ఫామ్ ను అందుకునే విషయంలో మాత్రం ఈ సీనియర్ బాట్స్మన్ ఇబ్బంది పడుతున్నాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా కాస్త ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. ఐపీఎల్ ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడినా… ఆ తర్వాత మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ విషయంలో కూడా ఫిట్నెస్ కనబడుతోంది. అయితే త్వరలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఎంతవరకు రాణిస్తాడు అనేది చెప్పలేని పరిస్థితి. ఇక కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ విషయంలో అనుమానాలు ఉన్నాయి. సారధ్య బాధ్యతలను కీలక సమయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అప్పగించడం కాస్త విమర్శలకు దారితీస్తోంది.
అయితే బోర్డు పెద్దలు ఇటీవల రోహిత్ శర్మతో చర్చలు జరిపారని అతనిని పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త సారధికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో ఇద్దరు ఆటగాళ్ల పేర్లను బోర్డు పరిశీలిస్తుంది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు గిల్ పేర్లను పరిశీలిస్తున్నారు. వీళ్ళిద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ డం ఉన్న ఆటగాళ్లే.
దీనితో వాళ్లకి ఇస్తే బాగుంటుంది అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. కేఎల్ రాహుల్(K L Rahul) ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఛాంపియన్ ట్రోఫీలో కూడా అంచనాలకు మించి రాణించాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన వండే సిరీస్ లో గిల్ దుమ్మురేపాడు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరికి టెస్ట్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించాలని బోర్డ్ భావిస్తుంది. ముందు టెస్ట్ క్రికెట్ బాధ్యతలను కొత్త ఆటగాడికి అప్పగించి.. ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.