Revathi Mannepally: తెలుగు మహిళకు అరుదైన అవకాశం

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా తెలుగు మహిళ రేవతి మన్నెపల్లి (Revathi Mannepally)ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) వెల్లడిరచారు. రేవతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని సూళ్లూరుపేట. స్వగ్రామంలో తొలి ఇంజినీర్ (Engineer) అయిన ఆమె అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డుకు నాయకత్వం వహించే పదవికి భారత్ తరపున నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగారు. ఆమెది ప్రపంచస్థాయిలో ప్రభావం చూపే అద్భుతమైన ప్రయాణం. 2027- 30 కాలానికి ఐటీయూ రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా నామినేట్ అయినందుకు రేవతికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆమె ఎన్నికైతే ఈ బ్యూరోకు నాయకత్వం వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. ఆమె విజయం సాధించి భారత విజన్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జ్యోతిరాదిత్య పేర్కొన్నారు. 2026లో జరిగే సమావేశంలో ఈమె ఎన్నిక జరుగుతుంది.