రిలయన్స్ కీలక ప్రకటన…2023 డిసెంబర్ నాటికి దేశంలోని
5జీ సేవలకు సంబంధించిన రిలయన్స్ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. కంపెనీ 45వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. దేశవ్యాప్త 5జీ నెట్వర్క్ను అందించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో దీపావళి నాటికి ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా సహా కీలక నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.






